Driving Licence – RTO : డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.. ఇదీ ప్రక్రియ!
parivahan.gov.in : రోడ్డు రవాణా- జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.
జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ : కొత్త డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి శుభవార్త. డ్రైవింగ్ లైసెన్స్, శిక్షణకు సంబంధించిన నిబంధనలలో ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు 1 జూన్ 2024 నుండి అమలులోకి వచ్చాయి. ఆ కొత్త రూల్స్ ఏంటో తెలుసుకుందాం..
RTO కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు:
కొత్త నిబంధనల ప్రకారం ఇకపై డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ పరీక్షకు ఆర్టీఓ కార్యాలయంలో కాకుండా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో హాజరుకావచ్చు. వారు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి సర్టిఫికెట్ జారీ చేస్తారు. దానితో పాటు మీరు RTO కార్యాలయం నుండి డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. నేరుగా ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లకుండా పూర్తిగా ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడం ఈ కొత్త నిబంధనల ప్రధాన లక్ష్యం.
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఇలా!
ముందుగా మీరు https://parivahan.gov.in/parivahan/ వెబ్‌సైట్‌ను తెరవాలి.
హోమ్ పేజీలో “డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్” ఎంపికపై క్లిక్ చేయండి.
వెంటనే అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది.
దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన వివరాలన్నీ పేర్కొనాలి.
అవసరమైన అన్ని పత్రాలను అప్లోడ్ చేయాలి.
నిబంధనల ప్రకారం దరఖాస్తు రుసుము చెల్లించాలి.
మీరు మీ ప్రాధాన్యత ప్రకారం ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత.. అవసరమైన పత్రాలతో ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లండి.
మీ డ్రైవింగ్ నైపుణ్యాల రుజువును RTOకి చూపించాలి.
మీ డ్రైవింగ్ నైపుణ్యాలు పరిపూర్ణంగా ఉంటే.. డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయబడుతుంది.
డ్రైవింగ్ లైసెన్స్ ఫీజు వివరాలు:
లెర్నర్స్ పర్మిట్ – రూ.200
లెర్నింగ్ పర్మిట్ రెన్యూవల్ – రూ.200
అంతర్జాతీయ లైసెన్స్ – రూ.1000
శాశ్వత లైసెన్స్ – రూ 200
పర్మినెంట్ లైసెన్స్ పునరుద్ధరణ – రూ.200
డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ జారీ, పునరుద్ధరణ – రూ.10,000
డ్రైవింగ్ స్కూల్ డూప్లికేట్ లైసెన్స్ – రూ.5000