Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హెచ్చరిక.. ఇల్లు కావాలంటే తప్పనిసరి..!
ఇందిరమ్మ ఇళ్ల కోసం పేదలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం రూ. 5 లక్షలు ప్రకటించి ఇందిర ఇంటి కోసం అర్హులైన పేదలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అమలుకు సంబంధించిన కీలక సమాచారం అందుబాటులోకి వచ్చింది. ORR-RRR మధ్య నిర్మించే ఇళ్లకు సౌరశక్తిని తప్పనిసరి చేయనున్నట్లు సమాచారం.
తెలంగాణలో సొంత ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తే.. కాంగ్రెస్ పార్టీ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది.
ఆరు హామీల్లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. సొంత భూమి ఉన్న పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. భూమి లేని వారికి భూమి, డబ్బులు కేటాయిస్తామని ప్రకటించారు.
కానీ ఇందిరమ్మ ఇళ్లకు సోలార్ పవర్ తప్పనిసరి. అయితే ఇది రాష్ట్రవ్యాప్తంగా లేదు. హైదరాబాద్ సబర్బన్ ఔటర్ రింగ్ రోడ్డు, కొత్తగా నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డు మధ్య నిర్మించే ఇళ్లకు సోలార్ తప్పనిసరి చేయనున్నట్టు సమాచారం.
ఈ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలి. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఇప్పటికే చెన్నై, బెంగళూరు, ముంబైలలో సోలార్ విద్యుత్ వినియోగిస్తున్న పేదల ఇళ్లను అధికారులు తనిఖీ చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం కీలక ప్రకటన చేశారు. తెలంగాణలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.
గృహ నిర్మాణాలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో పేదల ఇందిరమ్మ ఇళ్లకు అధిక నిధులు మంజూరు చేస్తామన్నారు.
వచ్చే నాలుగున్నరేళ్లలో 22.50 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేదలకు అందజేస్తామన్నారు. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాలకు కలిపి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 ఇళ్లను నిర్మించనున్నారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ సమావేశాల అనంతరం ఇందిర ఇళ్ల పంపిణీ జరగనున్నట్లు సమాచారం.