TG TET 2024 Results Update: జూన్ 12 నాటికి తెలంగాణ TET 2024 ఫలితాలు విడుదల

TG TET 2024 Results Update: జూన్ 12 నాటికి తెలంగాణ TET 2024 ఫలితాలు విడుదల, జూన్ 2 వరకు పరీక్షలు

TG TET 2024 ఫలితాల అప్‌డేట్: తెలంగాణ విద్యా శాఖ నిర్వహించే రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష జూన్ 2న ముగుస్తుంది. పరీక్షలు ముగిసిన వారం, పది రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారా నిర్వహిస్తారు.

TG TET 2024 Results Update

టీజీ టెట్ 2024 ఫలితాల అప్‌డేట్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను పరీక్షలు పూర్తయిన పది రోజుల్లోగా విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలు ముగిసిన పది రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 ఫలితాలు జూన్ 12న విడుదల కానున్నాయి. టెట్ పరీక్షకు మొత్తం 2,86,386 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 99,958 మంది పేపర్ 1 పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 1,86,428 మంది పేపర్ 2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌తో పాటు టెట్ మార్కులకు వెయిటేజీ ఇచ్చారు. డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో రాత పరీక్షకు 80%, టెట్‌కు 20% మార్కులు కేటాయిస్తారు.

తెలంగాణలో టెట్ పరీక్షలు మే 20 నుంచి ప్రారంభమయ్యాయి. హాల్ టిక్కెట్లు మే 15 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. జూన్ 2న తెలంగాణ టెట్ పరీక్షలు ముగియనున్నాయి. 25, 26, 27 తేదీల్లో పరీక్షలు ఉండవు. పరీక్షలు మిగతా అన్ని తేదీల్లో నిర్వహిస్తారు. జూన్ 12న ఫలితాలు వెల్లడికానున్నాయి.

తెలంగాణ టెట్ హాల్ టిక్కెట్లు మే 15 నుంచి అందుబాటులో ఉంటాయి. అంటే పరీక్షలు ప్రారంభమయ్యే ఐదు రోజుల ముందు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటిని https://tstet2024.aptonline.in/tstet/ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tstet2024.aptonline.in/tstet/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ‘డౌన్‌లోడ్ హాల్ టికెట్స్ 2024’ ఎంపికపై క్లిక్ చేయండి.

ఇక్కడ రిజిస్ట్రేషన్‌తోపాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.

సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి మరియు మీ హాల్ టికెట్ ప్రదర్శించబడుతుంది.

ప్రింట్ లేదా డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

పరీక్షా కేంద్రంలోకి వెళ్లేందుకు హాల్‌టికెట్‌ తప్పనిసరి. భవిష్యత్తు అవసరాల కోసం భద్రంగా ఉంచుకోవడం మంచిది.

TS TET టైమ్ టేబుల్ : తెలంగాణ TET పరీక్ష టైమ్ టేబుల్ – 2024

మే 20, 2024 – పేపర్ 2 – గణితం మరియు సైన్స్ (సెషన్ – S1)

మే 20, 2024 – పేపర్ 2 – గణితం మరియు సైన్స్ (సెషన్ – S)

మే 21, 2024 – పేపర్ 2 – గణితం మరియు సైన్స్ (సెషన్ – S1)

మే 21, 2024 – పేపర్ 2- గణితం మరియు సైన్స్ (సెషన్ – S2)

మే 22, 2024 – పేపర్ 2- గణితం మరియు సైన్స్ (సెషన్ – S1)

మే 22, 2024 – పేపర్ 2 – గణితం మరియు సైన్స్ (సెషన్ – S2)

మే 24, 2024 – పేపర్ 2 – సోషల్ స్టడీస్ (మైనర్ మీడియం) (సెషన్ – S1)

మే 24, 2024 – పేపర్ 2 – సోషల్ స్టడీస్ (సెషన్ – S2)

మే 28, 2024 – పేపర్ 2 – సోషల్ స్టడీస్ (సెషన్ – S1)

మే 28, 2024 – పేపర్ 2 – సోషల్ స్టడీస్ (సెషన్ – S2)

మే 29, 2024 – పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – S1)

మే 29, 2024 – పేపర్ 2- సోషల్ స్టడీస్ (సెషన్ – S2)

మే 30, 2024– పేపర్ 1 -(సెషన్ – S1)

మే 30, 2024 – పేపర్ 1- (సెషన్ – S2)

మే 31, 2024 – పేపర్ 1 -(సెషన్ – S1)

మే 31, 2024 – పేపర్ 1 -(సెషన్ – S2)

జూన్ 1, 2024 – పేపర్ 2- గణితం మరియు సైన్స్ (మైనర్ మీడియం)(సెషన్ – S1)

జూన్ 1, 2024 – పేపర్ 1-(మైనర్ మీడియం) (సెషన్ – S2)

జూన్ 2, 2024– పేపర్ 1 -(సెషన్ – S1)

జూన్ 2, 2024– పేపర్ 1-(సెషన్ – S2).

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment